గోదావరి జలాలపై ఆంధ్ర పాలకుల కుట్రలు..
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:35 PM
గోదావరి జలాలపై ఆంధ్ర పాలకులు మళ్లీ కు ట్రలు చేస్తున్నారని, దానిని ఎదిరించి అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్సీ దేశప తి శ్రీనివాస్, వాటర్ బోర్డు మాజీ చైర్మన్ వేముల ప్రకాష్ ద్వజమెత్తారు. నస్పూర్ ప ట్టణంలోని జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు రద్దు కోసం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది.
మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపు...
విద్యార్థి సదస్సులో వక్తలు...
నస్పూర్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : గోదావరి జలాలపై ఆంధ్ర పాలకులు మళ్లీ కు ట్రలు చేస్తున్నారని, దానిని ఎదిరించి అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్సీ దేశప తి శ్రీనివాస్, వాటర్ బోర్డు మాజీ చైర్మన్ వేముల ప్రకాష్ ద్వజమెత్తారు. నస్పూర్ ప ట్టణంలోని జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు రద్దు కోసం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మాట్లాడు తూ బనకచర్ల ద్వారా తెలంగాణ నీటి హక్కులను కొల్లగొట్టే కుట్రలు అడ్డుకోవాలన్నారు. ఆంధ్ర పాలక ప్రభుత్వం అక్రమంగా నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ఆపాలన్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి బనకచర్లను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మాణం చే సి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్, బీజీపీ ఎం పీలు, మంత్రులు పార్లమెంట్ ఈ విషయంపై కొట్లాడాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తోందని ఆరోపించారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి సాధించుకున్నామని, మళ్లీ గోదావరి జలాలను కా పాడుకునేందుకు ఉద్యమానికి సిద్ధం కావాలని కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్ హ యాంలో తాగు, సాగు నీటికి అధిక ప్రాధాన్యత కల్పించి వ్యవసాయ రంగాన్ని మ రింతగా అభివృద్ధి పరిచినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ వద్ద పగుళ్లు వస్తే దానిని రాజకీయం చేసారని ఆరోపించారు. ఈ సదస్సులు బీఆర్‌ఎస్ జిల్లా అ ధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, నాయకులు విజిత్ కుమార్, అక్కురి సుబ్బయ్య, గోగుల రవీందర్ రెడ్డి, దగ్గుల మధు, కందుల ప్రశాంత్, పల్లె భూమేష్‌లతో పాటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.