kumaram bheem asifabad- కాంగ్రెస్‌వి కుట్ర రాజకీయాలు
ABN , Publish Date - Sep 02 , 2025 | 10:15 PM
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌వి కుట్ర పూరిత రాజకీయాలు అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించడాన్ని నిరసిస్తూ మంగళవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఆసిఫాబాద్ రూరల్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌వి కుట్ర పూరిత రాజకీయాలు అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించడాన్ని నిరసిస్తూ మంగళవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని చెప్పారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా అద్భుతంగా పని చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఇప్పుడు పలచటి పునాదులతో కూడిన ప్రాజెక్టుగా చిత్రీకరించడం వెనుక దుర్భుద్ది ఉందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయాలకు వాడుకుని తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు సంజీవ్, పెంటు, వనజ, శంకరమ్మ, కలాం, రవీందర్, అజయ్, జీవన్, రవి, సందీప్, నిసార్, అశోక్, అశోక్, అహ్మద్, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్ నాయకులు రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ఆదేశాల మేరకు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు అస్లంబీన్ హసన్ మాట్లాడుతూ పీసీ ఘెష్ కమిషన్ నివేదికను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో అన్ని విధాల విఫలమైందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సై కమలాకర్ వారితో ధర్నా విరమింపజేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదేశాల మేరకు మండల కేంద్రంలో ధర్నా చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఇంతీయాజ్ లాలా, ఉపాధ్యక్షుడు ఆత్రం శంకర్, మాజీ సర్పంచులు మడావి భీంరావ్, మాస్రాం లక్ష్మణ్, మాజీ డైరెక్టర్ గేడాం లక్ష్మణ్, నాయకులు అడె లక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.