Congress Vote Bank: పెరిగిన కాంగ్రెస్ ఓటు బ్యాంక్!
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:20 AM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ క్రమంగా ఓట్లు పెంచుకుంటూ వస్తోంది. వరుసగా గత మూడు ఎన్నికల్లో ఆ పార్టీ ఓటు బ్యాంక్ పెరిగింది....
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ క్రమంగా ఓట్లు పెంచుకుంటూ వస్తోంది. వరుసగా గత మూడు ఎన్నికల్లో ఆ పార్టీ ఓటు బ్యాంక్ పెరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 64,212 ఓట్లు రాగా.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 89,705 ఓట్లు వచ్చాయి. తాజా ఉప ఎన్నికలో ఆ పార్టీ ఓటు బ్యాంకు మరింత పెరిగి.. 98,988కి చేరింది. చిత్రం ఏమిటంటే.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ, 2025 ఉప ఎన్నికలోనూ కాంగ్రె్‌సకు వచ్చిన ఓట్ల శాతం ఒకే రకంగా 50.83 శాతం చొప్పున ఉంది. కానీ.. ఆ పార్టీకి వచ్చిన ఓట్లల్లో మాత్రం 9,283 వ్యత్యాసముంది. పోలైన మొత్తం ఓట్ల సంఖ్య 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 1,76,466 ఓట్లు కాగా.. ఈ ఉప ఎన్నికలో 1,94,631 ఓట్లు రికార్డయ్యాయి.