Share News

Minister Seethakka: రేవంత్‌ పాలనకు ప్రజామోదం

ABN , Publish Date - Nov 15 , 2025 | 05:04 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం చరిత్రాత్మకమైనదని మంత్రి సీతక్క అన్నారు. ఈ ఫలితం బీఆర్‌ఎస్‌ పార్టీ తప్పుడు ప్రచారాలకు...

Minister Seethakka: రేవంత్‌ పాలనకు ప్రజామోదం

హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ విజయం చరిత్రాత్మకమైనదని మంత్రి సీతక్క అన్నారు. ఈ ఫలితం బీఆర్‌ఎస్‌ పార్టీ తప్పుడు ప్రచారాలకు ప్రజలు చెప్పిన గుణపాఠమని, రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనకు లభించిన ప్రజామోదమని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియాలో తప్ప తెలంగాణ సమాజంలో లేదని ఈ ఎన్నిక ఫలితంతో తేలిపోయిందని అన్నారు. ఇకనైనా బీఆర్‌ఎస్‌ నేతలు బుద్ధి తెచ్చుకుని హుందాగా రాజకీయాలు చేయాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించిన సీఎం రేవంత్‌రెడ్డి.. కెప్టెన్‌గా సక్సెస్‌ అయ్యారని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల్లోనూ ఇదే మాదిరిగా పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. తెలంగాణలో పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేసినట్లుగానే, కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా చేయాల్సిన అవసరం ఉందని గాంధీభవన్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో అభిప్రాయపడ్డారు.

Updated Date - Nov 15 , 2025 | 05:04 AM