Former minister Harish Rao: తాగుబోతుల తెలంగాణగా మార్చింది కాంగ్రెస్సే
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:50 AM
రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టి తాగుబోతుల రాష్ట్రంగా తెలంగాణను మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు...
మాజీ మంత్రి హరీశ్‌రావు
వట్‌పల్లి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టి తాగుబోతుల రాష్ట్రంగా తెలంగాణను మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలంలో అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ హామీలను విస్మరించిందని హరీశ్‌రావు ఆరోపించారు. రైతులకు యూరియా కూడా అందించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. అందోల్ నియోజకవర్గంలోని 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనపెట్టిందని, ఆ పనులు మళ్లీ చేపట్టేందుకు త్వరలో పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు.