Congress MLC Addanki Dayakar: జూబ్లీహిల్స్‌లోనూ కాంగ్రె్‌సదే గెలుపు
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:56 AM
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ప్రజలు కాంగ్రె్‌సను ఎలా గెలిపించారో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అలానే గెలిపిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్సీ...
ఓటమి తప్పదని కేటీఆర్‌కు అర్థమైంది: బల్మూరి
హైదారబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ప్రజలు కాంగ్రె్‌సను ఎలా గెలిపించారో.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అలానే గెలిపిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ధీమా వ్యక్తం చేశారు. హరీశ్‌రావు, కేటీఆర్‌లు ఎంత సెంటిమెంట్ రుద్దినా ఏ ఉపయోగం లేదన్నారు. బీఆర్‌ఎస్ బుల్డోజర్ పాలనను ప్రజలు కోరుకోవట్లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిపక్షం అటుంచి.. బీఆర్‌ఎస్ అసలు ఉనికిలోనే లేదన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ గెలుస్తుందన్న భ్రమల్లో హరీశ్, కేటీఆర్‌లు ఉన్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని కేటీఆర్‌కు అర్థమైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. అందుకే గెలవడం చేతకాక.. ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని మాట్లాడుతున్నాడని ఓ ప్రకటనలో విమర్శించారు. కేటీఆర్ చెబుతున్న ఓటరు జాబితా 2023లోనే తయారైందని, అందులో ఏమైనా తప్పులుంటే ఈసీకి ఆధారాలు సమర్పిస్తే సరిపోతుందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఆ పార్టీ ఎంతగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. కాగా, ఇటీవల అస్వస్థతకు గురైన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్‌ను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి పరామర్శించారు.