TPCC Mahesh Kumar Goud: కవితను పార్టీలోకి ఆహ్వానించాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదు
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:37 AM
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ కావడ మనేది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, దానిపై...
కవిత సస్పెన్షన్.. వారి అంతర్గత వ్యవహారం
వాటాల తగాదానే వేటుకు దారి తీసి ఉండొచ్చు
టీపీసీసీ చీఫ్ మహే్‌శ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ కావడ మనేది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, దానిపై కాంగ్రెస్ పార్టీ స్పందించబోదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. కవితను పార్టీలోకి ఆహ్వానించాలన్న ఆలోచనగానీ, అవసరంగానీ తమ పార్టీకి లేవని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఉందని, అందులో ఎవరినీ వెనుకేసుకు రావాల్సిన అవసరం తమకు లే దని ఆయన చెప్పారు. అవినీతి సంపదలో వాటాల తగాదాలే సస్పెన్షన్‌కు దారి తీసి ఉండొచ్చని మహేశ్‌కుమార్ అన్నారు.
హరీశ్‌పై కవిత అస్త్రం సంధించడం వెనుక ఆంతర్యం ఏంటి?
కవిత సస్పెన్షన్‌కు ముందు మంగళవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మాట్లాడారు. నిన్న మొన్నటి దాకా కేటీఆర్‌పై ఆరోపణలు చేసిన కవిత.. తన అస్త్రాన్ని హరీశ్‌రావు వైపుకు మరల్చడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. మొదటి దఫా ప్రభుత్వంలోనే ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీశ్ తప్పు చేస్తే.. కవిత అప్పుడెందుకు మాట్లాడలేదని, కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన నిలదీశారు. కవిత మాటలతో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తేలిపోయిందన్నారు. ఈ ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ అవినీతికి కూడా బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇప్పుడు కాళేశ్వరం కేసు.. సీబీఐ కోర్టులోకి చేరిందని, విచారణ పేరుతో కేసును సాగదీస్తే.. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేనన్నది మరోమారు స్పష్టం అవుతుందని మహేఽశ్ కుమార్ గౌడ్ చెప్పారు. కాళేశ్వరం దొంగలకు శిక్ష వేేస అవకాశం కేంద్రంలోని బీజేపీకి వచ్చిందని, ఆ పార్టీ నేతలు తమ చిత్తశుద్ధి చాటుకోవాలని అన్నారు.
గాంధీభవన్‌లో వైఎ్‌సఆర్‌కు నివాళి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నివాళి అర్పించారు. మంగళవారం గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ కేవీపీ రామచందర్‌రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.