Share News

అమలుకు నోచుకోని కాంగ్రెస్‌ హామీలు...

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:49 PM

తెలంగాణలో కాంగ్రెస్‌ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడుస్తున్నప్పటికి ఎన్ని కల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అఽధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపిం చారు. నస్పూర్‌లోని సీసీసీలో శనివారం వికలాంగులు, వితంతువు లు, వృద్ధులు, ఒంటరి మహిళలు పెన్షన్‌దారుల సమావేశానికి ముఖ్య అథితిగా హాజరైయ్యారు.

అమలుకు నోచుకోని కాంగ్రెస్‌ హామీలు...
నస్పూర్‌ సమావేశంలో మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

వికలాంగులు,వృద్ధుల, వితంతువుల సమావేశంలో మంద కృష్ణ మాదిగ

నస్పూర్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో కాంగ్రెస్‌ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు గడుస్తున్నప్పటికి ఎన్ని కల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అఽధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపిం చారు. నస్పూర్‌లోని సీసీసీలో శనివారం వికలాంగులు, వితంతువు లు, వృద్ధులు, ఒంటరి మహిళలు పెన్షన్‌దారుల సమావేశానికి ముఖ్య అథితిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మా దిగ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో మే నిఫెస్టోలో వికలాంగులకు ఆరు వేలు, వృద్ధులకు, వితంతువులకు నాలుగు వేల పెన్షన్‌ ఇస్తామని చెప్పి నేటి వరకు అమలు చేయ లేదన్నారు. ప్రతి పక్ష హోదాలో ఉన్న బీఆర్‌ఎస్‌ మాజీ సీఎం కేసీ ఆర్‌ ప్రతి పక్ష పాత్ర పోషించకుండా ఫాంహౌజ్‌కే పరిమితమ య్యారన్నారు. ఏపీలో అమలు చేసినట్లు తెలంగాణలో కూడా అ మలు చేయాలన్నారు. 8వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీ ల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు, వికలాంగులు, వితంతువులు, వృద్దులు పెన్షన్‌దారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 11:49 PM