Share News

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:25 PM

డుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ బలో పేతానికి ప్రతీ ఒక్కరు సైనికుల్లా పని చేయాలని ఎమ్మె ల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
బీకే తిర్మలాపూర్‌లో రేణుకాఎల్లమ్మ దేవత ఆలయ ముఖద్వారాన్ని దాత ముద్దునూరు శేషయ్యతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

- ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

అచ్చంపేట, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : బ డుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ బలో పేతానికి ప్రతీ ఒక్కరు సైనికుల్లా పని చేయాలని ఎమ్మె ల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. గురువారం మండల పరిధిలోని అవు సలికుంట గ్రామంలో మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు రంగినేని శ్రీని వాసరావు ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు. వారికి కండువా కప్పి కాంగ్రెస్‌ పా ర్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలే కాంగ్రెస్‌ పార్టీకి వెన్నెముకలాంటి వారన్నారు. కాంగ్రెస్‌ ప్రభు త్వం పథకాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయా లని ఆయన సూచించా రు. రాబోయే స్ధానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. అచ్చంపేట పట్టణంలో ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారుకలకు క ల్యాణలక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే అందచేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ఇందిరమ్మ, శివ, గోపాల్‌రెడ్డి రాంబాబు, అనంతరెడ్డి, రఘ ఉన్నారు.

బీకే తిర్మలాపూర్‌లో...

అమ్రాబాద్‌ : మండల పరిధిలోని బీకే తిర్మ లాపూర్‌ గ్రామంలో రేణుకాఎల్లమ్మ దేవత ఆల య ముఖద్వారాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ గురు వారం ప్రారంభించారు. మండల పరిధిలోని మన్ననూర్‌ గ్రామానికి చెందిన ముద్దునూరు శేషయ్య తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అమ్రా బాద్‌లో అచ్చంపేట- మద్దిమడుగు ప్రఽధాన రహదారిపై ఈ ఆలయ ముఖద్వారాన్ని ఏర్పా టు చేశారు. కార్యక్రమంలో దాత ముద్దునూరు శేషయ్య, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 11:25 PM