kumaram bheem asifabad-కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి
ABN , Publish Date - Nov 28 , 2025 | 10:28 PM
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
కెరమెరి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను ఇతర ప్రాంత వాసి అని కొందరు పని కట్టుకుని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను ఈ ప్రాంతంలోనే సిర్పూర్(యూ) మండలంలో పుట్టి పెరిగి అక్కడ, ఇక్కడ ఉద్యోగం చేశానని గుర్త చేశారు. ఈ ప్రాంత వాసితోనే వివాహం జరిగిందన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి స్థానిక ఎన్నికలలో అభ్యర్థుల విజయానికి వర్గవిభేదాలు, కులానికి తావు లేకుండా పార్టీ అభ్యర్థుల విజమానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, నాయకులు శంకర్‌నాయక్, కుసుమ్‌రావు, ఎల్లప్ప, రజాక్, సుజాయిద్, మారుతి, గిడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అఽధ్వర్యంలో మండలంలోని పారా, పొచంలొద్ది, సుకుడ్‌పెల్లి, కొండాపటార్ తదితర గ్రామాల బీఆర్‌ఎస్ నాయకులు పార్టీలో చేరగా కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొచంలొద్ది మాజీ సర్పంచ్ మడావి మనోహర్, నగేష్ పటేల్ (పారా), లంకేష్, సోయం పైకు, కుంర లక్ష్మణ్, కుంర భుజంగ్‌రావ్, మడావి శ్రీ కాంత్, ఆత్రం కన్ను, మేస్రాం మారు,షేక్ మాజర్, సయద్ జుబెర్, సయద్ ఆజర్, ఆర్షద్ ఖాన్, సయద్ వసీం, ,సయద్ ఉస్మాన్, షేక్ ఇస్మాయిల్, సల్మాన్ ఖాన్, రహీం, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మండలఅధ్యక్షులు అబ్దుల్ ముకీద్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.