Share News

TPCC chief Mahesh Kumar Goud: కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతివ్వండి

ABN , Publish Date - Oct 22 , 2025 | 04:30 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంకు టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌......

TPCC chief Mahesh Kumar Goud: కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతివ్వండి

  • కోదండరాంకు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ లేఖ

  • బీఆర్‌ఎస్‌ ఓ దండుపాళ్యం ముఠా: చామల

హైదరాబాద్‌, బేగంపేట, అక్టోబరు 21(ఆంధరజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంకు టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ మంగళవారం లేఖ రాశారు. 22 నెలలుగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోందని, ఈ తరుణంలో ఉప ఎన్నిక అత్యంత కీలకంగా మారిందన్నారు. ఈ ఎన్నికలో బీఆర్‌ఎస్‌ను ఓడించడం కాంగ్రె్‌సను గెలిపిచడం అందరి బాధ్యతని తెలిపారు. నవీన్‌ యాదవ్‌కు టీజేఎస్‌ తరఫున సంపూర్ణ మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ బేగంపేటలోని దేవనార్‌ అంధుల పాఠశాలలో సోమవారం దీపావళి వేడుకలు చేసుకున్నారు. అక్కడి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టి, వారితో కలిసి బాణసంచా కాల్చారు. కాగా, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి డిపాజిట్‌ గల్లంతవుతుందనే భయంతోనే బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు గల్లీగల్లీ తిరుగుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌ వద్ద మంగళవారం విలేకరులతో మాట్లాడిన చామల.. బీఆర్‌ఎస్‌ ఓ దండుపాళ్యం ముఠా అని అన్నారు. బీఆర్‌ఎస్‌ విషయంలో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్‌ అభ్యర్ధి నవీన్‌ యాదవ్‌ నామినేషన్‌ ర్యాలీని చూసి బీఆర్‌ఎ్‌సకు దడ పుట్టిందన్నారు. ఇక, విష్ణువర్ధన్‌ ఎందుకు నామినేషన్‌ వేశారో బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలకు చెప్పాలని చామల డిమాండ్‌ చేశారు.

నవీన్‌యాదవ్‌తోనే జూబ్లీహిల్స్‌ అభివృద్ధి: ఒవైసీ

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో అభివృద్ధి ప్రాతిపదికన ఓటింగ్‌ జరగాలని కోరుకుంటున్నానని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మంగళవారం విలేకరులతో అన్నారు. జూబ్లీహిల్స్‌ ప్రజలు పదేళ్లు బీఆర్‌ఎ్‌సకు అవకాశం ఇచ్చారని, కానీ ఆ పార్టీ ఎమ్మెల్యే దానిని వినియోగించుకోలేదని విమర్శించారు. పదేళ్లలో జూబ్లీహిల్స్‌లోని ఏ వార్డులోనూ అభివృద్ధి జరగలేదన్న ఒవైసీ.. ఈ సారి అభివృద్ధిని ప్రాతిపదికగా తీసుకుని ప్రజలు ఓట్లు వేయాలని ఆశిస్తున్నానని చెప్పారు. ఈ ఉప ఎన్నికలో ఎంఐఎం పోటీ చేయడం లేదని, కాంగ్రెస్‌ అభ్యర్ధి నవీన్‌యాదవ్‌కు మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. నవీన్‌ యాదవ్‌ విజయంతోనే జూబ్లీహిల్స్‌ అభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పారు.

Updated Date - Oct 22 , 2025 | 04:30 AM