Deputy CM Bhatti Vikramarka: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:27 AM
రాష్ట్రంలో రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 85ు సర్పంచ్‌లను గెలుచుకుని ప్రభంజనం సృష్టించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు...
1960 తర్వాత మధిరలో అత్యధిక స్థానాలు ఇదే తొలిసారి
సర్పంచ్‌ల అభినందన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిర, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండు విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 85ు సర్పంచ్‌లను గెలుచుకుని ప్రభంజనం సృష్టించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ సెగ్మెంట్‌లోని మధిర, బోనకల్, ఎర్రుపాలెం మండలాల్లో గెలుపొందిన గ్రామ పంచాయతీ సర్పంచ్‌లకు మంగళవారం మధిరలో జరిగిన అభినందన సభలో వారిని భట్టి విక్రమార్క సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మధిర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 1960 తరువాత కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద సంఖ్యలో అత్యధిక సర్పంచ్ స్థానాలను గెలవటం ఇదే తొలిసారి అన్నారు. 131 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ 90 స్థానాలను గెలుపొందిందన్నారు. ప్రజా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు కాంగ్రె్‌సకు పట్టం కట్టారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.