Share News

Mallikarjun Kharge advised: గ్రూపు రాజకీయాలకు తావులేదు

ABN , Publish Date - Sep 27 , 2025 | 04:22 AM

కాంగ్రె్‌సలో గ్రూపు రాజకీయాలకు తావు లేదని, అలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గవద్దని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్గున ఖర్గే.. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సూచించారు. కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. ఢిల్లీలో ఖర్గేతో మహేశ్‌గౌడ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భం...

Mallikarjun Kharge advised: గ్రూపు రాజకీయాలకు తావులేదు

  • జిల్లాల్లో సమర్థ నాయకత్వాన్ని తయారు చేయాలి.. జూబ్లీహిల్స్‌లో గెలుపు గుర్రానికే టికెట్‌ ఇవ్వాలి

  • మహేశ్‌గౌడ్‌కు ఖర్గే దిశానిర్దేశం

  • పనిచేసే వాళ్లకే డీసీసీ అధ్యక్ష పదవులు

  • ఒక్కో అధ్యక్షుడి కోసం ఆరుగురి పేర్లు8వచ్చే నెలాఖరులోపు నియామకాలు: మహేశ్‌

  • పీసీసీ చీఫ్‌ వెంట బొంతు రామ్మోహన్‌?

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రె్‌సలో గ్రూపు రాజకీయాలకు తావు లేదని, అలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గవద్దని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్గున ఖర్గే.. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సూచించారు. కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. ఢిల్లీలో ఖర్గేతో మహేశ్‌గౌడ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, డీసీసీ అధ్యక్షుల నియామకం, జూబ్లీహిల్స్‌ అభ్యర్థి ఎంపిక, బీసీ రిజర్వేషన్‌ బిల్లు సహా ఇతర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ఖర్గేను కలిసిన తర్వాత మహేశ్‌గౌడ్‌ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలను ఖర్గేకు వివరించినట్లు చెప్పారు. జిల్లాల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయాల్సిందిగా ఖర్గే సూచించారని, క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనే నాయకులకే బాధ్యతలు అప్పగించాలంటూ నిర్దేశించారని తెలిపారు. సంస్థాగత పునర్నిర్మాణం పకద్బందీగా చేపట్టాలని, ఏ గ్రూపు ఒత్తిడికీ లొంగకుండా పనిచేయాలని చెప్పారన్నారు. అక్టోబరు 4 నుంచి ఏఐసీసీ పరిశీలకులు అన్ని జిల్లాల్లో పర్యటిస్తారని, 14వ తేదీ నాటికి ఒక్కో డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆరుగురి పేర్లను అధిష్ఠానానికి సమర్పిస్తారని పేర్కొన్నారు. అక్టోబరు నెలాఖరు కల్లా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తవుతుందన్నారు.


జూబ్లీహిల్స్‌లో గెలిచి తీరాలి..

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై ఖర్గేతో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చర్చించినట్టు తెలిసింది. ఇప్పటికే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్‌ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌లతో కూడిన కమిటీని నియమించామని, ఆ కమిటీ స్థానిక పరిస్థితులు, అభ్యర్థులపై సానుకూలత తదితర అంశాలపై అధ్యయనం చేస్తోందని ఖర్గేకు చెప్పినట్టు సమాచారం. కాగా, కంటోన్మెంట్‌ తరహాలోనే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలోనూ గెలిచి తీరాలని ఖర్గే అన్నట్లు, గెలుపు గుర్రానికే టికెట్‌ ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. అయితే.. అక్కడి నుంచి టికెట్‌ ఆశిస్తున్న మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సైతం మహేశ్‌గౌడ్‌ వెంట మల్లికార్జున ఖర్గే వద్దకు వెళ్లినట్టు సమాచారం. కాగా, మూసీ సుందరీకరణ చేపట్టడం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఇష్టం లేదని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. ఖర్గేను కలిసేందుకు వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిపై కిషన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. అది సాకారమయ్యేదన్నారు.. కిషన్‌రెడ్డిపై తనకు వ్యక్తిగతమైన కోపమేమీ లేదని, ఆయన తనకు మంచి మిత్రుడేనని, తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్నందుకే ప్రశ్నిస్తున్నానని తెలిపారు.

Updated Date - Sep 27 , 2025 | 04:22 AM