కాంగ్రెస్ నాయకుల నిరసన
ABN , Publish Date - Dec 28 , 2025 | 10:42 PM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకంలో గాంధీ ఫొటోను తొలగించేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పీసీసీ జిల్లా అధ్యక్షు డు రఘునాధ్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
కోటపల్లి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి హామీ పథకంలో గాంధీ ఫొటోను తొలగించేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పీసీసీ జిల్లా అధ్యక్షు డు రఘునాధ్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి గాంధీ ఫొటో చేత పట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. గాంధీ ఫొటోను తొలగిస్తే ఉద్యమిస్తామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, సర్పంచు ఆలూరి సంపత్, నాయకులు రాజమల్లగౌడ్, బైస ప్రభాకర్, దుర్గం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
జన్నారం: మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు ను తొలగించడంపై మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై మహాత్మగాంధీ చిత్రపటాలతో నిరసన తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షు లు ముజాఫర్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్‌లు మాట్లాడుతూ బీజేపీ ఇష్టానుసారంగా పేర్లు మార్చుతూ పేదలకు ఉపాధి చూపిన మహాత్మగాఽంధీ పేరును మార్చడం పట్ల సరికాద న్నారు. నాయకులు భూమేశ్, ఫసియుల్లా, సుభాష్‌రెడ్డి, మాణిక్యం, ఇంద య్యలతో పాటు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.