Share News

kumaram bheem asifabad- చర్లపల్లి డ్రగ్స్‌ ముఠా వెనుక కాంగ్రెస్‌ నాయకుల హస్తం

ABN , Publish Date - Sep 07 , 2025 | 10:55 PM

తెలంగాణ చరిత్రలో మొదటి అతి పెద్ద డ్రగ్స్‌ కేసు హైదరాబాద్‌లోని చర్లపల్లిలో 12వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ ఒక కంపెనీలో పట్టుబడటం దారుణమని, దీని వెనుకాల కాంగ్రెస్‌ నాయకుల హస్తం ఉందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనికి హోం మంత్రి నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

kumaram bheem asifabad- చర్లపల్లి డ్రగ్స్‌ ముఠా వెనుక కాంగ్రెస్‌ నాయకుల హస్తం
మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ చరిత్రలో మొదటి అతి పెద్ద డ్రగ్స్‌ కేసు హైదరాబాద్‌లోని చర్లపల్లిలో 12వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ ఒక కంపెనీలో పట్టుబడటం దారుణమని, దీని వెనుకాల కాంగ్రెస్‌ నాయకుల హస్తం ఉందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనికి హోం మంత్రి నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో గుజరాత్‌లో ఆదానికి సంబంధించిన పోర్టులో 21 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయని గుర్తు చేశారు. తెలంగాణలో రెండో అత్యంత పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ దొరకడం ఆందోళనకరంగా ఉందన్నారు. ఈ డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు చేసింది మహారాష్ట్ర పోలీసులని చెప్పారు. నెల రోజుల పాటు మహారాష్ట్ర పోలీసులు మకాం వేసి అన్ని ఆధారాలతో దాడులు చేసి డ్రగ్స్‌ను పట్టుకున్నారని అన్నారు.ఓలేటి శ్రీనివాస్‌ విజయ్‌, పండరినాథ్‌, జలెందర్‌ రెడ్డి అనే నిందితులు ఈ దందా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారని అన్నారు. ఈ డ్రగ్స్‌ అంతర్జాతీయంగా సరఫరా చేస్తున్నారని అన్నా రు. ఈ విషయం మహారాష్ట్ర పోలీసులు చెబుతుంటే తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నట్టు ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి సౌరథ్యంలో నడుస్తున్న హోం శాఖ విఫలమైందని తెలిపారు. సమావేశంలో సిర్పూరు నియోజకవర్గ కన్వీనర్‌ లెండుగురే శ్యాంరావు, కొంగసత్యనారాయణ, గోలేంవెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): సిర్పూరు(టి) మండలం పారిగాం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌, బీజేపీ పార్టీకి చెందిన కొందర నాయకులు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సమక్షంలో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ సిద్దాంతాలకు ఆకర్షితులై తాము చేరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిర్పూరు(టి) బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు అస్లం బీన్‌ అబ్దుల్లా, నాయకులు హీరామాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 10:55 PM