Minister Jupalli Krishnarao: ముస్లింల సంక్షేమానికి పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్
ABN , Publish Date - Nov 08 , 2025 | 02:40 AM
ముస్లింల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జూబ్లీహిల్స్...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి జూపల్లి
బోరబండ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ముస్లింల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్‌లో శుక్రవారం ఆయన పర్యటించారు. సుల్తాన్‌నగర్ మస్జిద్-ఈ-మొహమ్మదీయలో ప్రార్థనల అనంతరం స్థానిక ముస్లిం సోదరులతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలు, ఫలాలను కాంగ్రెస్ అందించిందన్నారు. షాదీ ఖానాలు, మసీదుల అభివృద్ధి, ఈద్గాల నిర్మాణం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముస్లింలకు సరైన ప్రాధాన్యం ఇచ్చిన ఘనత కాంగ్రె్‌సకే దక్కుతుందని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.