రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:35 PM
రాష్ట్రంలో రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పాత బ స్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ‘అప్పుడే మంచిగ ఉండే’ కార్యక్రమం లో ఆయన పాల్గొని మాట్లాడారు.
చెన్నూరు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పాత బ స్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ‘అప్పుడే మంచిగ ఉండే’ కార్యక్రమం లో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల పాలిట శాపంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎరువులు, విత్త నాలు, యూరియా కోసం రోడ్డెక్కడం, పండించిన పత్తి, వరి పంటలు అ మ్ముకునేందుకు ఆందోళనలు చేయడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంద న్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ వల్ల బ్యాక్ వాటర్‌తో పంటలు మునిగి తీవ్ర నష్టం జరిగిందన్న మంత్రి వివేక్‌వెంకటస్వామి ఇప్పుడు ఆయా బ్యారేజీల గేట్లు ఎత్తి ఉన్నా వరదలతో పంటలు నీటమునిగి పంటలు నష్టపోయారని, మరి దీన్నే మంటారని ఎద్దేవా చేశారు. కొత్త బస్టాండ్ నుంచి గాంధీ చౌక్ వరకు నా యకులతో కలిసి యూరియా అందించడం లేదని నిరసన ర్యాలీ నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రాజారమేష్, మాజీ జడ్పీ టీసీ తిరు పతి, మాజీ ఎంపీపీ మంత్రి బాపు, మాజీ వైస్ ఎంపీపీ బాపు రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.