బీసీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
ABN , Publish Date - Aug 17 , 2025 | 11:40 PM
సీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు బడి ఉందని ఎమ్మెల్యే డాక్ట ర్ వంశీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేట, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టు బడి ఉందని ఎమ్మెల్యే డాక్ట ర్ వంశీకృష్ణ అన్నారు. ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బీసీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కొన్ని నెల ల క్రితం కులగణన జరిపిన తరువాత బీసీలకు 42శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సాఽధించుకోవడానికి తెలం గాణ ఉద్యమం మాదిరి అన్ని వర్గాల భాగస్వా మ్యంతో పోరాటం చేయాల్సిన అవసరం ఎంతై నా ఉందన్నారు. ఈ నెల 20వ తేదీన పట్టణం లో నిర్వ హించే భారీ ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గ్గొని బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధనకు కేంద్ర ప్రభుత్వంపైఒత్తిడి పెంచాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, బీసీ సంఘం జిల్లా నాయకులు కాశన్న యాదవ్, నాయకులు శ్రీనివాసులు, గోపిశెట్టి శివ, చరణ్‌గౌడ్, శారదమ్మ, నిరంజన్, సత్యమ్మ, హరినారాయణగౌడ్, క్యామ మల్లయ్య, నాయకులు పాల్గొన్నారు.
పేదలకు ఆసరాగా ప్రభుత్వ పథకాలు
వంగూరు : ప్రభుత్వ సంక్షేమ పథకాలు పే దలకు ఆసరాగా ఉన్నాయని అచ్చంపేట ఎమ్మె ల్యే వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మండలం లోని వెంకటాపూర్‌లో కొత్తగా మంజూరైన రేష న్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రొసీడింగ్‌లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మాచినేనిపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో కొత్తగా 70 రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలి పారు. పేదల, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ అల్వాల్‌రెడ్డి, మం డల రేషన్‌డీలర్ల సంఘం అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, రమేష్‌గౌడ్, హర్షిత్‌రెడ్డి యాదగిరిరావు, హరీశ్‌రెడ్డి పాల్గొన్నారు.