Share News

హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్‌

ABN , Publish Date - Apr 04 , 2025 | 11:13 PM

ఎన్నికల సమయంలో ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఫైళ్ల ఆశయ్య అన్నారు. సీపీఎం రాష్ట్ర, జిల్లా కమిటీ పిలుపు మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లోని సీపీఎం బృందాలు 15రోజుల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే చేపట్టారు.

హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్‌
ధర్నా చేస్తున్న సీపిఎం నాయకులు, ఆదివాసీ గిరిజనులు

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకుల ధర్నా

దండేపల్లి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఫైళ్ల ఆశయ్య అన్నారు. సీపీఎం రాష్ట్ర, జిల్లా కమిటీ పిలుపు మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లోని సీపీఎం బృందాలు 15రోజుల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే చేపట్టారు. శుక్రవా రం సీపీఎం, టీఏజీఎస్‌ ఆధ్వర్యంలో ఆదివాసి గిరిజనులు, ప్రజలతో దండేపల్లి బస్టాండ్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ముందుగా చాకలి ఐలమ్మ, అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రె్‌స్‌ ప్రభుత్వం పథకాల పేరిట ప్రజలను మోసం చేస్తూ సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యా రంటి పథకాలను పక్కాగా అమలు చేయాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. గిరిజన గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పలు డిమాండ్‌, సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్‌ సంధ్యారాణికి వినతిప త్రా న్ని అంద జేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శులు సంకె రవి, కనికారపు అశోక్‌, బోడేంకి చందు, సభ్యులు దుంపల రంజిత్‌కుమార్‌, అబ్దుల్లా, ఆదివాసి గిరిజన సంఘం నాయకులు శ్యామల, ఉమారాణి, సమక్క, లింగన్న, రైతు సంఘం నాయకులు లక్ష్మణ్‌, సిఐటియు నాయకులు రమాదేవి గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 11:13 PM