Share News

మంచినీటి సౌకర్యం కల్పించడంలో కాంగ్రెస్‌ విఫలం

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:32 PM

చెన్నూరు పట్టణానికి మంచినీటి సౌకర్యం కల్పించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు.

మంచినీటి సౌకర్యం కల్పించడంలో కాంగ్రెస్‌ విఫలం
చోటా హనుమాన్‌ ఆలయ పరిసరాలను శుభ్రం చేస్తున్న బీజేపీ నాయకులు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌

చెన్నూరు, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరు పట్టణానికి మంచినీటి సౌకర్యం కల్పించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు. గురువారం ప ట్టణంలోని చోటా హనుమాన్‌ ఆలయంలో పూజలు చేసి గావ్‌ చలో భస్తీ చలో కార్యక్రమాన్ని ప్రారం భిం చారు. అనంతరం నాయకులతో కలిసి గుడి పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. 9వ వార్డులోని ప్రజల ఇండ్లకు వెళ్లి ప్రధాని మోదీ అమలు చేస్తున్న పథకాల గురించి వివరిం చారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రానికి చేరుకుని పిల్లలతో మాట్లాడారు. చెన్నూరు పట్టణంలో ప్రస్తుతం నిర్మిస్తున్న వాటర్‌ ట్యాంక్‌తో క లిపి 12 నీళ్ల ట్యాంకులు ఉన్నాయని, ఒక్క ట్యాంకు నుంచి కూడా బిందెడు నీరు రఆవడం లేదని ఆరోపిం చారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వినోద్‌ మంత్రిగా ఉన్నప్పుడు కోటి లింగాల నుంచి రూ. 4 కోట్లతో నిర్మించిన మంచినీటి పథకం చెన్నూరు పట్టణానికి సంవత్సర కాలం కూడా నీరు ఇవ్వలేదని, అది కాల గర్భంలో కలిసిపోయిందన్నారు. చెన్నూరు నుంచి వేలాది లారీల్లో ఇసుక ఇతర ప్రాంతాలకు వెళ్తుందని, కానీ ప ట్టణ ప్రజలకు మాత్రం ఇసుక రీచ్‌ను ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటన్నారు. స్ధానిక మున్సిపల్‌ కమిషనర్‌కు టాక్స్‌లు వసూలు చేయడం మీద ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకటేశ్వర్‌, మాజీ కన్సిలర్‌ కమ్మల శ్రీనివాస్‌, నాయకులు శ్రీనివాస్‌, వెంకట నర్సయ్య, స్వరూపరాణి, శ్రీపాల్‌, శివకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:32 PM