ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్‌కు అలవాటే
ABN , Publish Date - Oct 13 , 2025 | 10:54 PM
ప్రజలను మో సం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవటే అని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు అన్నారు. మండ లంలోని జెండవెంకటాపూర్ గ్రామంలో సోమవారం మా జీ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ మో సపూరిత హామీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తు కాం గ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు
లక్షెట్టిపేట, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రజలను మో సం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవటే అని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు అన్నారు. మండ లంలోని జెండవెంకటాపూర్ గ్రామంలో సోమవారం మా జీ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ మో సపూరిత హామీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తు కాం గ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడు తూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అబద్దపు హామీ లు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. సుమారు 420 హామీలు ప్రజలకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క హమీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కానీ బీ ఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హమీల అమలులో ముం దుంటుందని ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజలకు ఇ చ్చిన హామీలతో పాటు ప్రజలకు అవసరం ఉన్న ప్రతీ ప థకం ఎధావిధిగా అందించిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రజల ప క్షాన ఉంటుందన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మోస పూరిత హామీలపై విడుదల చేసి బాకీ కార్డులను ప్రజల కు పంపిణీ చేసారు. ఈకార్యక్రమంలో డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వెల్తపు సు ధాకర్, యూత్ అద్యక్షుడు గంగాధర్, మాజీ ఎంపీటీసీ దావిద్ పాల్గొన్నారు.