Minister Uttam Kumar Reddy: కాంగ్రెస్ హయాంలో 80 వేల ఉద్యోగాలు
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:45 AM
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 80 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట...
యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో 25న మెగా జాబ్‌మేళా
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హుజూర్‌నగర్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 80 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఈనెల 25న నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా స్థలాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్, ఎస్పీ నర్సింహతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టిసారించామన్నారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలోని యువతీ, యువకుల కోసం హుజూర్‌నగర్‌లో 205 కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటివరకు 9,500 మంది యువకులు ఉపాధి కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, జాబ్‌మేళాకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు. సుమారు 5 వేల మందికి పైగా ఈ మేళా ద్వారా ఉపాధి పొందే అవకాశం కల్పిస్తామని, భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.