Ponnam Prabhakar: కాంగ్రెస్ వచ్చాక లాభాల్లో ఆర్టీసీ
ABN , Publish Date - Jun 25 , 2025 | 04:54 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
గతంలో ఆర్టీసీ మూతపడే పరిస్థితి: పొన్నం
ఎల్లారెడ్డి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఎస్‌డీఎఫ్ నిధులు 4.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన బస్టాండ్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోందని, పదేళ్ల కాలంలో సంస్థలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తాను రవాణా శాఖ మంత్రిగా నియామకమయ్యాక రాష్ట్రవ్యాప్తంగా కేవలం 48 గంటలలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు తదితరులు పాల్గొన్నారు.