Share News

Congress Exceeds Exit Poll Predictions: ఎగ్జిట్‌ పోల్స్‌ను మించి.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ విజయం

ABN , Publish Date - Nov 15 , 2025 | 05:33 AM

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను మించి కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని దక్కించుకుంది. మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేసిన దానికంటే ఎక్కువ....

Congress Exceeds Exit Poll Predictions: ఎగ్జిట్‌ పోల్స్‌ను మించి.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ విజయం

  • వాస్తవానికి దగ్గరగా ఆరా, రాజనీతి స్ట్రాటజీ సంస్థల అంచనా

  • అందనంత దూరంలో కేకే సర్వే అంచనా

హైదరాబాద్‌, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను మించి కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని దక్కించుకుంది. మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఓట్లను కాంగ్రెస్‌ సాధించింది. ఈ ఉపఎన్నికలో కాంగ్రె్‌సకు 50.85ు (98,988), బీఆర్‌ఎ్‌సకు 38.15 శాతం(74,259) ఓట్లు వచ్చాయి. ఆరా, రాజనీతి స్ట్రాటజీస్‌, స్మార్ట్‌, నాగన్న, పీసీఎస్‌, హెచ్‌ఎంఆర్‌, స్టాట్‌, చాణక్య స్ర్టాటజీస్‌, పీఆర్‌ ఎవర్‌ మీడియా, ఆత్మసాక్షి వంటి సర్వే సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రె్‌సను ముందంజలో చూపించాయి. అయితే, ఆరా సంస్థ, రాజనీతి స్ట్రాటజీస్‌ అంచనాలు వాస్తవ ఫలితానికి చాలా దగ్గరగా ఉన్నాయి. కాంగ్రె్‌సకు దాదాపు 50 శాతం ఓట్లు, బీఆర్‌ఎ్‌సకు 39 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సంస్థలు వెల్లడించాయి. కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా కూడా పని చేసిన ఆరా సంస్థ.. కాంగ్రె్‌సకు 25,000 ఓట్ల మెజారిటీ వస్తుందని చెప్పింది. వాస్తవంలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ 24,729 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆరా, రాజనీతి మినహా మిగిలిన సంస్థలు కాంగ్రెస్‌ సాధించే మెజారిటీని చాలా తక్కువగా పేర్కొన్నాయి.

అందనంత దూరంలో కేకే సంస్థ అంచనా..

ఇక కొన్ని సంస్థలు కాంగ్రెస్‌ ఓడిపోతుందని, బీఆర్‌ఎస్‌ మెజారిటీ సాధిస్తుందని అంచనాలను విడుదల చేశాయి. అలాంటి సంస్థల్లో కేకే సర్వే ముఖ్యమైనది. బీఆర్‌ఎ్‌సకు 33,866 ఓట్ల మెజారిటీ వస్తుందని కేకే సర్వే పేర్కొంది. క్యూమెగా, నేషనల్‌ ఫ్యామిలీ ఒపీనియన్‌, మిషన్‌ చాణక్య వంటి సంస్థలు కూడా బీఆర్‌ఎస్‌ పార్టీనే గెలుస్తుందని చెప్పాయి.

Updated Date - Nov 15 , 2025 | 05:33 AM