Share News

Mahesh Goud: ప్రజాపాలన మెచ్చి కాంగ్రె్‌సకు పట్టం

ABN , Publish Date - Dec 13 , 2025 | 05:32 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రజాపాలనను మెచ్చి.. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీ మద్దతుదారులకు పట్టం కట్టారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు....

Mahesh Goud: ప్రజాపాలన మెచ్చి కాంగ్రె్‌సకు పట్టం

హైదరాబాద్‌/జీడిమెట్ల డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రజాపాలనను మెచ్చి.. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీ మద్దతుదారులకు పట్టం కట్టారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో మహేశ్‌గౌడ్‌ విలేకరులతో మాట్లాడారు. ఓటు చోరీకి సంబంధించి రాష్ట్రంలో 14 లక్షల సంతకాల సేకరణ జరిగిందని మహేశ్‌గౌడ్‌ తెలిపారు. ఈ నెల 14న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగే మహాధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీఏసీ సభ్యులంతా పాల్గొంటారని చెప్పారు. తెలంగాణలోనూ ఓటు చోరీతోనే బీజేపీ ఎంపీలు గెలిచారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వేసిన ఓట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. కల్వకుంట్ల కవితకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉంటే తప్పు లేదని, అయితే అత్యాశ ఉండరాదని అన్నారు. కవిత కొన్ని వాస్తవాలను బయటపెడుతున్నారని, ఆమె ఆరోపణలపై విచారణకు సీఎం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకున్న జగద్గిరిగుట్ట వాసి ఈశ్వరాచారి కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌, మహేశ్‌గౌడ్‌, బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ శుక్రవారం పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందజేశారు. ఈశ్వరాచారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, ముగ్గురు పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యనందిస్తామని, ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ’

Updated Date - Dec 13 , 2025 | 05:32 AM