Minister Uttam Kumar Reddy: జూబ్లీహిల్స్‌లో కాంగ్రె్‌సదే విజయం: ఉత్తమ్
ABN , Publish Date - Oct 31 , 2025 | 02:30 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రె్‌సదే విజయం అని, అన్ని సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు..
బీజేపీ, బీఆర్‌ఎ్‌సవి డ్రామాలు: పొన్నం
యూసు్‌ఫగూడ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రె్‌సదే విజయం అని, అన్ని సర్వేలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసు్‌ఫగూడ, కృష్ణానగర్‌లలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలు నిర్లక్ష్యానికి గురయ్యారని, 20 నెలల కాంగ్రెస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పేదలకు 40 వేల తెల్ల రేషన్ కార్డుల ఇచ్చామని చెప్పారు. దేశచరిత్రలో మొట్టమొదటిసారిగా నిరుపేదలందరికీ నాణ్యమైన సన్నబియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. నాడు సంక్షేమ పథకాలను విస్మరించిన బీఆర్‌ఎస్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి పాల్పడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 12 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పాలని, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఉప ఎన్నికలలో బీజేపీకి ఓటు వేస్తే బీఆర్‌ఎ్‌సకీ వేసినట్టేనని అన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, ప్రతీ గృహానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని చేస్తుంటే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.