Minister Ponguleti Srinivas Reddy: 23 నెలల అభివృద్ధి మా బలం
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:50 AM
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 23 నెలల్లో చేపట్టిన అభివృద్ధి పనులే పంచాయతీ ఎన్నికల్లో తమకు అంతులేని బలాన్ని ఇస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువు
మంత్రి పొంగులేటి
ఖమ్మం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 23 నెలల్లో చేపట్టిన అభివృద్ధి పనులే పంచాయతీ ఎన్నికల్లో తమకు అంతులేని బలాన్ని ఇస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మం 60వ డివిజన్ రామన్నపేటలో రూ.కోటి అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రెయినేజీల నిర్మాణానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ప్రజలకు ఇచ్చిన హామీలలే కాకుండా ఇవ్వని హామీలను కూడా పూర్తిచేసి వారి మనసులను గెలుచుకున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితమే బీఆర్‌ఎస్ పార్టీ బలహీనతకు స్పష్టమైన నిదర్శనమని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి కూడా బీఆర్‌ఎ్‌సకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయ ఢంకా మోగిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేకపోతున్న బీఆర్‌ఎస్ నాయకులు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పొంగులేటి విమర్శించారు.