Congress Celebrates: గాంధీభవన్‌లో సంబరాలు
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:26 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు...
హైదరాబాద్ సిటీ/మర్కుక్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన సంబరాల్లో వీ హనుమంతరావుతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది నేతలు‘తగ్గేదేలే.. 2028లో 100’, ‘రప్పా.. రప్పా’ అనే పోస్టర్లు ప్రదర్శించారు. జూబ్లీహిల్స్ గెలుపుపై గాంధీభవన్‌తో పాటు గ్రేటర్‌వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు స్వీట్లు పంచి, టపాసులు పేలుస్తూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మరోవైపు, మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం అయిన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలో కూడా కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచారు.