Share News

KTR Criticizes Revanth Governance: కాంగ్రెస్‌, బీజేపీల మధ్య అపవిత్ర పొత్తు

ABN , Publish Date - Dec 29 , 2025 | 01:58 AM

బీఆర్‌ఎ్‌సను తెలంగాణలో బొంద పెట్టేందుకు కాంగ్రెస్‌, బీజేపీ మధ్య అపవిత్ర పొత్తు కొనసాగుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

 KTR Criticizes Revanth Governance: కాంగ్రెస్‌, బీజేపీల మధ్య అపవిత్ర పొత్తు

  • కేసీఆర్‌ది రైతు పాలన..రేవంత్‌ది రాబంధు పాలన:కేటీఆర్‌

నాగర్‌కర్నూల్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సను తెలంగాణలో బొంద పెట్టేందుకు కాంగ్రెస్‌, బీజేపీ మధ్య అపవిత్ర పొత్తు కొనసాగుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఆదివారం కేటీఆర్‌ సన్మానించారు. అడ్డగోలు హామీలతో మభ్య పెట్టిన పార్టీలను అన్ని ఎన్నికల్లోనూ నిలదీయాలని కేటీఆర్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 10 ఏళ్లు రైతు బంధు పాలన సాగితే.. సీఎం రేవంత్‌ రెడ్డి సారథ్యంలో రాబంధుల పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం దేవుడెరుగు యూరియా బస్తాల కోసం రైతులు అధికారుల కాళ్లు మొక్కాల్సిన దుస్థితి నెలకొందని కేటీఆర్‌ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డికి రైతుల కంటే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపైనే మక్కువని, పదవి ముగిసేలోపు ఆయన రూ.5లక్షల కోట్ల ఆదాయం సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్‌ ప్రధాన శత్రువని తెలిపారు. 1952లో మహబూబ్‌ నగర్‌ జిల్లాకు కృష్ణా అప్పర్‌ ప్రాజెక్టు ద్వారా 150 టీఎంసీల నీరందించే అవకాశాన్ని కాంగ్రెస్‌ విస్మరించడం వల్లే పాలమూరు రైతాంగం గోస పడుతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. ఆంధ్రా ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేసిందని కేటీఆర్‌ ఆరోపించారు. అందుకే మెరుగైన విద్య కోసం తన తండ్రి కేసీఆర్‌.. తనను విజయవాడ, అమరావతి, గుంటూరుజిల్లాలకు పంపారన్నారు. ఈ విషయమై పదే పదే తనను తప్పు పడుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. ఆంధ్రా ప్రాంతంలోని భీమవరం నుంచి ఇంటల్లుడ్ని ఎందుకు తెచ్చుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రూ.35వేలకోట్ల అంచనా వ్యయంతో తమ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రెండేళ్లలో కాంగ్రెస్‌ సర్కారు 10ు కూడా పూర్తి చేయలేదన్నారు. తన పాత గురువు చంద్రబాబు మెప్పు కోసం చిట్టి నాయుడు (సీఎం రేవంత్‌ ప్రయత్నిస్తున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 01:58 AM