Share News

kumaram bheem asifabad- కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల యూరియా దందా

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:22 PM

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు యూరియా దందా చేస్తూ రైతులకు అందకుండా బ్లాక్‌లో అమ్ముకుంటూ దోచుకుంటు న్నారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.270కి దొరికే యూరియా రూ.1000లకు అమ్ముతున్నారని ఆరోపించారు.

kumaram bheem asifabad- కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల యూరియా దందా
మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌

బెజ్జూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు యూరియా దందా చేస్తూ రైతులకు అందకుండా బ్లాక్‌లో అమ్ముకుంటూ దోచుకుంటు న్నారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.270కి దొరికే యూరియా రూ.1000లకు అమ్ముతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలనలో ఎమ్మెల్యే గన్‌మెన్‌లు తుపాకులు చూపెట్టి లారీల కొద్ది యూరియా మాయం చేస్తున్నారన్నారు. ఇటీవల కౌటాల మండలం బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అనుచరులు లారీ యూరియాను దారి మళ్లీంచారని ఆరోపించారు. ఈ విషయంలో జిల్లా వ్యవసాయాధికారి కూడా సస్పెండ్‌ అయ్యారని తెలిపారు. గతంలో కేసీఆర్‌ పాలనలో యూరియా కోసం ఇంత దారుణంగా రైతులు బాధపడలేదని చెప్పారు. రైతులకు ఏనాడు కష్టం రానివ్వ లేదని గుర్తు చేశారు. ఆయన వెంట నాయకులు హర్షద్‌ హుస్సేన్‌, సారయ్య, తిరుపతి, ఖాజా, బాబురావు, మోహన్‌, దేవయ్య తదితరులు ఉన్నారు.

బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

సిర్పూర్‌(టి), సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు బుధవారం ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 11:22 PM