Share News

kumaram bheem asifabad- కాంగ్రెస్‌, బీజేపీతోనే బీసీలకు అన్యాయం

ABN , Publish Date - Oct 09 , 2025 | 10:44 PM

కాంగ్రెస్‌, బీజేపీ వైఖరీతోనే బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగిందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. పట్టణంలోన తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన జీవో 9పై రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రంలోని బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీతో కలిసి బీసీలకు మోసం చేశారని తెలిపారు

kumaram bheem asifabad- కాంగ్రెస్‌, బీజేపీతోనే బీసీలకు అన్యాయం
మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

కాగజ్‌నగర్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌, బీజేపీ వైఖరీతోనే బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగిందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. పట్టణంలోన తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన జీవో 9పై రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రంలోని బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీతో కలిసి బీసీలకు మోసం చేశారని తెలిపారు. రాష్ట్ర గవర్నర్‌ ఆరు నెలలుగా ఈ జీవోకు ఎందుకు ఆమోదం తెలుపలేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్‌ మీద అక్రమ కేసులు పెట్టడానికి తెచ్చిన జీవోలు, రేవంత్‌రెడ్డి లాభం చేకూర్చే జీవోలు, కాళేశ్వరం కమిషన్‌కు సంబంధించి అన్ని ఆంశాలపై వెంటనే ఆమోదం ఎలా తెలిపారని ప్రశ్నించారు. బీసీలకు లాభం చేకూర్చే జీవోపై ఎందుకు ఆమోదం తెలుపలేదని చెప్పారు. తెలంగాణలో బీసీలంతా ఓట్లేసి గెలిపించిన 8 మంది బీజేపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీసీలకు న్యాయం చేసే బిల్లువిషయంలో ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకరావడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అంతా తెలిసి కోర్టులో విచారణ జరుగుతుండగా, ఎన్నికల నోటిఫకేషన్‌ విడుదల చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గం కన్వీనర్‌ లెండుగురే శ్యాంరావు, సీనియర్‌ ఉద్యమ కారుడు కొంగ సత్యనారాయణ, సలీం, మినాజ్‌, గోలేం వెంకటేష్‌, షాకీర్‌, పోశం, అతియాబాను లహెంచు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 10:44 PM