kumaram bheem asifabad- బాధ్యులైన అధికారులకు అభినందనలు
ABN , Publish Date - Dec 18 , 2025 | 10:24 PM
పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరగడంలో బాధ్యత వహించిన అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అభినందనలు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్ దోత్రే, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాలను జిల్లా అదనపు ఎన్నికల అదికారి, డీపీవో భిక్షపతి గౌడ్, కార్యాలయ సిబ్బందిని శాలువాతో గురువారం సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరగడంలో బాధ్యత వహించిన అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అభినందనలు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్ దోత్రే, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాలను జిల్లా అదనపు ఎన్నికల అదికారి, డీపీవో భిక్షపతి గౌడ్, కార్యాలయ సిబ్బందిని శాలువాతో గురువారం సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ మూడు విడతలుగా జరిగిన పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్, హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలియపరుస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా చెల్లించడానికి ప్రభుత్వానికి పరతిపాదనలు పంపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల మండల పరిషత అభివృద్ధి అధికారి రాజేంద్రప్రసాద్, జిల్లాలోని ఆసిఫాబాద్ మిషన భగీరథ ఏఈ రాజు ఎన్నికల విధి నిర్వహణలో మృతి చెందారని తెలిపారు. రాష్ట్రంలో 11,487 సర్పంచ్, 85,955 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగగా 1,205 సర్పంచ్ స్థానాలు, 25,848 వార్డు స్థానాలకు ఏకగ్రీవం అయ్యాయని, మూడు దశలలో జరిగిన ఎన్నికల్లో 85.30 శాతంతో 1,35,23,137 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకన్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంలో అధికారుల పాత్ర అభినందనీయమన్నారు. మండల పరిషత్ అధికారులు, ఇత జిల్లా అధికారుల నుంచి నేరుగా నివేదికలు పొందేందుకు నోడల్ అధికారులను నియమించామని అన్నారు. జిల్లా స్థాయిలో పరిశీలకులను నియమించి పటిష్టంగా ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి తగిన సూచనలు చేసేందుకు గాను రాష్ట్ర స్థాయిలో స్ర్కీనింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శాంతిభద్రత, సౌహార్థ వాతావరణాన్ని కాపాడేందుకు బీఎన్‌ఎసెస్ సెక్షన్ 163 ప్రకారం నిషేదాజ్ఞలను అమలు చేశామని తెలిపారు. రూల్ -15 ప్రకారం పోటీ లేని ఎన్నికల ఫలితాన్ని ప్రకటించే ముందు రిటర్నింగ అధికారుల ద్వారా తప్పని సరిగా పాటించాలని అధికారిక నిర్ధారణ విధానాన్ని నిర్దేశించామని వివరించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా అనుకొని ఘటనలు సంభవించిన తక్షణమే పరిష్కరించామని తెలిపారు. మద్య దుకాణాల మూసివేత, పోలింగ్ కేంద్రాల లోపల, బయట చోటు చేసుకున్న అనుకొని ఘటనలు, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై జోనల్ అధికారుల నుంచి ప్రత్యక్ష సమాచారాన్ని సేకరించి వాటిని వెంటనే గమనించి ఆలస్యం లేకుండా పరిష్కరించామన్నారు. రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయినందు ఆదర్శ ప్రవర్తన నియమావళి సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని తెలిపారు.