Share News

Harish Rao Criticize: కృష్ణా జలాల వాటాపైఅవగాహన లేని రేవంత్‌, ఉత్తమ్‌

ABN , Publish Date - Sep 25 , 2025 | 04:34 AM

కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశామని మంత్రి ఉత్తమ్‌ గొప్పగా చెప్పారు. మరి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాత్రం జూన్‌ 18న కృష్ణా బేసిన్‌...

Harish Rao Criticize: కృష్ణా జలాల వాటాపైఅవగాహన లేని రేవంత్‌, ఉత్తమ్‌

  • సీఎంది ఒక మాట, మంత్రిది మరో మాట

  • సమ్మక్క సాగర్‌ పూర్తి చేసింది బీఆర్‌ఎస్సే

  • కాంగ్రె్‌సది అబద్ధపు ప్రచారం: హరీశ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘కృష్ణా జలాల్లో 763 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశామని మంత్రి ఉత్తమ్‌ గొప్పగా చెప్పారు. మరి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాత్రం జూన్‌ 18న కృష్ణా బేసిన్‌ మీద 500 టీఎంసీలకు బ్లాంకెట్‌ ఎన్‌వోసీ ఇవ్వండి.. ఆ తర్వాత ఏ ప్రాజెక్టులైన కట్టుకోండి అని ఏపీ సీఎం చంద్రబాబుకు ఆఫర్‌ ఇచ్చారు. ఈ నెల 13న జరిగిన నీటి పారుదల శాఖ సమీక్షలో కృష్ణా జలాల్లో 904 టీఎంసీల వాటా సాఽధించి తీరాలి అని సీఎం అన్నారు. కృష్ణా జలాల వాటా విషయంలో సీఎం ఒక మాట.. మంత్రి ఉత్తమ్‌ మరో మాట మాట్లాడారు. నీటి వాటాపై వారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’’ అని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. సీఎం, మంత్రి అజ్ఞానం వల్ల తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఉందని బుధవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ కృష్ణా జలాల్లో పూర్తి వాటా సాధించేందుకు సెక్షన్‌ 3 కోసం పోరాటం చేశారని పేర్కొన్నారు. సమ్మక్క-సారక్క బ్యారేజీకి మంత్రి ఉత్తమ్‌ అనుమతులు సాధించినట్టు చెప్పుకుంటున్నారని.. ఛత్తీ్‌సగఢ్‌తో కేవలం 50 ఎకరాల ముంపునకు సంబంధించి సూత్రప్రాయ అంగీకారం కుదిరితే ఏవో గొప్పలు సాధించినట్టు ప్రచారం చేసుకుంటున్నారన్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ చేసిన తప్పులను సరిదిద్ది, దేవాదులను పటిష్ఠం చేసేందుకు ఏడు టీఎంసీల సామర్థ్యంతో సమ్మక్క-సార క్క బ్యారేజీని కేసీఆర్‌ నిర్మించినట్లు తెలిపారు. కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచాలని నిర్ణయించిందని, ఈ విషయంపై సీఎం రేవంత్‌ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు.

Updated Date - Sep 25 , 2025 | 04:34 AM