Share News

kumaram bheem asifabad- పత్తి దిగుబడిపై దిగులు

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:58 PM

ఆరుగాలం శ్రమించే రైతున్నకు ఏటేటా కష్టాలు తప్పడం లేదు. ప్రకృతి వైపరీత్యాలకు అన్నదాతలు విలవిలలాడుతున్నారు. అతివృష్టి, అనావృష్టితో ఏటా ఏదో ఒక రూపంతో జిల్లా రైతాంగం అతలాకుతలమవుతోంది. ఏటేటా పంట సాగు ఖర్చులు పెరుగుతున్నప్పటికీ గిట్టుబాటు ధర లభించక పోవడంతో రైతాంగం తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుంది.

kumaram bheem asifabad- పత్తి దిగుబడిపై దిగులు
భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తిపంట(ఫైల్‌)

- పది వేల ఎకరాల్లో పంట నష్టం

- ప్రకృతి వైపరీత్యాలకు కుదేలవుతున్న రైతు

- పరిహారం అందించాలని అన్నదాతల వినతి

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం శ్రమించే రైతున్నకు ఏటేటా కష్టాలు తప్పడం లేదు. ప్రకృతి వైపరీత్యాలకు అన్నదాతలు విలవిలలాడుతున్నారు. అతివృష్టి, అనావృష్టితో ఏటా ఏదో ఒక రూపంతో జిల్లా రైతాంగం అతలాకుతలమవుతోంది. ఏటేటా పంట సాగు ఖర్చులు పెరుగుతున్నప్పటికీ గిట్టుబాటు ధర లభించక పోవడంతో రైతాంగం తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుంది. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్‌ ప్రారంభంలో విత్తనాలు విత్తిన రైతన్నలు పంటల దిగుబడి పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసారైన పంటలు ఆశించిన స్థాయిలో పండు తాయని బావించిన రైతాంగానికి తీవ్ర నిరాశే ఎదురైం ది. ఎకదాటిగా వర్షాలు కురుస్తునే ఉండడంతో వేసిన పంటలు ఎదుగుదల లేక రైతన్నలు దిగాలు చెందు తున్నారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా సుమారు పదివేల ఎకరాలలో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 4,45,04 9 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నా యి. ఇందులో పత్తి 3,35,363 ఎకరాలు, వరి పంట 56,861 ఎకరాలు, కంది పంట 30,430 సాగవుతుంది. మొక్కజొన్న, జొన్న, పెసర, మిను ములు, సోయబీన్‌, మిరప, వేరు శెనగ, ఆముదాలు, నువ్వులు 22,395 ఎకరాలలో పంటలను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో ప్రతి ఏటా రైతులు పత్తిపంట వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది ఆధిక వర్షాల కారణంగా పత్తిపంట సాగు చేస్తున్న రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది.

- భారీ వర్షాలకు..

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లాలో పెద్ద ఎత్తున పత్తి పంటను సాగు చేసిన రైతులను భారీ వర్షాలు తీవ్రంగా నష్టానికి గురి చేశాయి. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు పదివేల ఎకరాలలో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనాలు వేశారు. కొన్ని మండలాలలో ఎకదాటిగా కురిసిన వర్షాలకు పంటలు నీట మునిగాయి. నది పరివాహక ప్రాంతాలలోని పంటచేలలో ఇసుక మేటలు వేశాయి. వర్షాలతో పంటచేలలో నీరు నిలువ ఉండడంతో మొక్కలు కుళ్లిపోయి పంట ఎదుగుదల నిలిచిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పత్తిపంట సాగుచే స్తున్న రైతాంగానికి కలుపు తీయడానికి కూడా వీలు లేకుండా పోయింది. దీంతో ఏపుగా పెరిగిన కలుపుతో పంట ఎదుగుదల తగ్గిందని రైతులు వాపోతున్నారు.

- ఎగువ నుంచి వరద..

జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు పెనుగంగా, ప్రాణ హిత, పెద్దవాగులకు వరద పోటెత్తడంతో ఉగ్రరూపం దాల్చి అతలాకుతలం చేశాయి. జిల్లాలోని పెనుగంగా, ప్రాణహిత,పెద్దవాగు సరిహద్దు పరివాహక మండలా లైన కౌటాల. చింతలమానేపలి, బెజ్జూర్‌, పెంచికలపే ట్‌, దహెగాంలలో వేల ఎకారాలలో పంట నష్టం వాటిల్లింది. వరదల కారణంగా పంట పొలాలు వరద నీటిలో మునిగి పోయాయి. కొన్ని చోట్ల ఇసుక మేట లు వేశాయి. మరికొన్ని చోట్ల పంటలు కొట్టుకుపోయి ఎడారిలా మారాయి. సిర్పూర్‌ నియోజకవర్గంలో ఏటా వర్షాకాలంలో ప్రాణహిత. పెనుగంగా, పెద్దవాగు పరీవాహక ప్రాంతాల్లో వరదలు పంటలను ముంచె త్తుతునే ఉన్నాయి. మహారాష్ట్రలో వర్షాలు కురిసినా, అ క్కడి ప్రాజెక్టుల నీటిని వదిలినా ప్రాణహిత పరివా హక మండలాల్లో తీవ్ర పంట నష్టం జరుగుతోంది. దీంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. నాలుగైదే ళ్లుగా పంటలు నష్టపోయిన వారికి పరిహారం రాలేద ని రైతులు వాపోతున్నారు.

ఫ పంటలు దెబ్బతిన్నాయి..

- సంజీవ్‌ , రైతు

పత్తి మొలకెత్తె దశ నుంచి మొదలుకొని మొక్కలు పెరిగే దశ వరకు భారీ వర్షాలు కురువడంతో పంట తీవ్రంగా దెబ్బతిన్నది. కొన్ని చోట్ల పంట చేలలో రోజుల తరబడి వరదనీరు నిలిచి ఉండడంతో మొక్క లు కుళ్లిపోయాయి. దీంతో పెట్టుబడులు సైతం రావ డం కష్టంగా ఉంది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

Updated Date - Sep 03 , 2025 | 11:58 PM