kumaram bheem asifabad- విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించాలి
ABN , Publish Date - Aug 26 , 2025 | 10:48 PM
విద్యార్థులకు రోజు గంట పాటు కంప్యూటర్ విద్యను అందించాలని ఇన్‌చార్జి డీఈవో, అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు పట్టిక, వసతుల కల్పన, మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ విద్య తదితర వాటిని పరిశీలించారు.
సిర్పూర్(టి), ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు రోజు గంట పాటు కంప్యూటర్ విద్యను అందించాలని ఇన్‌చార్జి డీఈవో, అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు పట్టిక, వసతుల కల్పన, మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ విద్య తదితర వాటిని పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రతి రోజు గంట పాటు కంప్యూటర్ విద్యను బోధించాలన్నారు. ఈ సందర్భంగా స్వయంగా విద్యార్థులకు కంప్యూటర్ విద్యను బోధించారు. అలాగే మధ్యాహ్న బోజనంను పరిశీలించి భోజన విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పదవ తరగతి విద్యార్థులు వంత శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. అనంతరం ఇంకుడు గుంతకు భూమి పూజ చేశారు. అనంతరం లోనవెల్లి పీహెచ్‌సీను సందర్శించి అక్కడ వసతులు, ఆసుపత్రిలో రోగులకు ఏర్పాటు, మందుల నిలువలను అడిగి తెలుసుకున్నారు. విధులను పకడ్బందీగా నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో సత్యనారాయణ, ఎంఈవో వేణుగోపాల్‌రావు, ప్రధానోపాధ్యాయులు సదాశివుడు, సీఆర్పీ పవన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.