బాల, బాలికలు విధిగా పాఠశాలల్లో చేరాలి
ABN , Publish Date - Jun 12 , 2025 | 11:36 PM
14 సంవ త్సరాలలోపు బాల బాలి కలు విధిగా పాఠశాలల్లో చదువుకోవాలని లీగల్ స ర్వీసెస్ అథారిటీ జిల్లా సెక్ర టరీ నసీం సుల్తానా అన్నారు.
- లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా సెక్రటరీ నసీం సుల్తానా
కందనూలు, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : 14 సంవ త్సరాలలోపు బాల బాలి కలు విధిగా పాఠశాలల్లో చదువుకోవాలని లీగల్ స ర్వీసెస్ అథారిటీ జిల్లా సెక్ర టరీ నసీం సుల్తానా అన్నారు. అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం పురస్కరిం చుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వ ర్యంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత బా లుర పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. చిన్నారులచేత వెట్టి చాకిరీ చేయిం చడం నేరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్, డి ప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శ్రీరామ్ ఆర్య, అడ్వకేట్ జగదీశ్, ఉపాధ్యాయు లు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పాల్గొన్నారు.