Share News

kumaram bheem asifabad-పల్లె సదుపాయాలపై సమగ్ర సర్వే

ABN , Publish Date - Sep 26 , 2025 | 10:58 PM

పల్లెల్లోని మౌలిక సదుపాయాలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నా యి. ఇప్పుడున్న వసతులు, ఇంకా ఏమైనా కల్పించాల్సి ఉందా అన్న అంశాలను గుర్తిస్తున్నాయి. తాజాగా కేంద్రం ప్రత్యేక సర్వే చేపడుతోంది. గ్రామాల్లో సొంత ఆదాయ వనరులను పెంపొందించడం, వాటి సాయంతో వసతులు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. సర్వే వివరాల నమోదుకు ‘సమర్థ పంచాయతీ’ యాప్‌ అందు బాటులోకి తెచ్చారు.

kumaram bheem asifabad-పల్లె సదుపాయాలపై సమగ్ర సర్వే
బెజ్జూరు గ్రామపంచాయతీ కార్యాలయం

- ప్రత్యేక పోర్టల్‌ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం

బెజ్జూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లోని మౌలిక సదుపాయాలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నా యి. ఇప్పుడున్న వసతులు, ఇంకా ఏమైనా కల్పించాల్సి ఉందా అన్న అంశాలను గుర్తిస్తున్నాయి. తాజాగా కేంద్రం ప్రత్యేక సర్వే చేపడుతోంది. గ్రామాల్లో సొంత ఆదాయ వనరులను పెంపొందించడం, వాటి సాయంతో వసతులు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. సర్వే వివరాల నమోదుకు ‘సమర్థ పంచాయతీ’ యాప్‌ అందు బాటులోకి తెచ్చారు. వివరాల నమోదు ప్రక్రియ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల పర్యవేక్షణలో త్వరలో ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మొత్తం 335గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

- పంచాయతీల వారీగా..

యాప్‌లో గ్రామపంచాయతీల వారీగా కార్యదర్శులు వనరుల సమగ్ర వివరాలను నమోదు చేయనున్నారు. ఈ వివరాలు ఎంపీడీవోలకు అందుతాయి. వారిద్వారా కేంద్రానికి అన్ని పంచాయతీల సమాచారం అందు తుంది. ఇంకా చేపట్టాల్సిన పనులు-నిధుల అంచనాలు రూపొందిస్తారు. ఎంపీడీవో చైర్మెన్‌గా, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఏర్పాటయ్యే కమిటీ వాటిని పరిశీలిస్తుంది. సర్వే చేయాల్సిన తీరుపై అన్ని మండ లాల ఎంపీడీవోలకు ఇటీవల అవగాహన కల్పించారు. వారు కార్యదర్శులకు యాప్‌ గురించి వివరిస్తారు. త్వరలో అన్ని గ్రామాల్లో ఏకకాలంలో వసతులు గుర్తిం చి, వివరాలు, నిక్షిప్తం చేస్తారు. ఇంకా పూర్తి మార్గదర్శకాలు అందాల్సి ఉంది.

- నమోదు ఇలా..

గ్రామ జనాభా, పంచాయతీ కార్యాలయం, అంగన్‌వా డీలు, పాఠశాలలు, ఆరోగ్య ఉపకేం దం, గ్రంథాలయం, కమ్యూనిటీ భవనాలు, రైతువేదిక, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, పాల సేకరణ కేంద్రాలు నమోదు చేస్తారు. వైకుంఠధామం, పల్లె నర్సరీ, ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, మహిళా స్వయం ఉపాధి యూనిట్లు, స్వయం సహాయక సంఘాలు, వీధి దీపాలు, కుళాయి లు, బోరు బావులు, మోటార్లు, మురుగు కాల్వలు, రోడ్లు, వంతె నలు, ఇంకుడు గుంతలు, పారిశుధ్య ట్రాక్టర్లు, ట్రాలీలు, నీటి ట్యాంకర్లు నమోదవుతాయి.

- చివరి పంచాయతీ వరకు..

ఈ గ్రామ్‌ స్వరాజ్‌ కార్యక్రమం ద్వారా చివరి పంచా యతీ పంచాయతీ వరకు డిజిట లైజేషన్‌ అవుతుంది. ఇందులో నిధుల ట్రాకింగ్‌, పథకాల అమలు, పరిపాలన, ఆర్థిక లావా దేవీలను పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. బడ్జెట్‌ గ్రాంట్లు, గ్రామస్థుల ఆమోదం, ప్రణాళి కలు అభివృద్ధి. వార్షిక ప్రణాళిక, అభివృద్ధి పనులకు సాయం, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఉపయోగపడు తుంది. ప్రాజెక్టు ఆమోదం, గ్రామసభల నిర్ణయాలు, బడ్జెట్‌ ప్రతిపాదనలు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ సాధనకు కృషి చేస్తారు. మురు గునీటి తొలగింపు, మరుగుదొడ్ల నిర్మాణ పర్యవేక్షణ. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాల సాధనకు కృషి చేస్తారు.

Updated Date - Sep 26 , 2025 | 10:58 PM