Share News

kumaram bheem asifabad- బీజేపీ పాలనలో దేశ సమగ్రాభివృద్ధి

ABN , Publish Date - Jun 12 , 2025 | 10:27 PM

ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో భారత్‌ దేశం సమగ్ర అభివృద్ధి దిశగా సాగుతున్నదని. కాగజ్‌నగర్‌ కంజర్వేషన్‌ రిజర్వేషన్‌గా తీసుకు వచ్చి జీవో 49కి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఎంపీ గేడెం నగేష్‌ అన్నారు. 11ఏళ్ల బీజేపీ పాలనకు సంబంధించి గురువారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే హరీష్‌బాబుతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

kumaram bheem asifabad- బీజేపీ పాలనలో దేశ సమగ్రాభివృద్ధి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ నగేష్‌

ఆసిఫాబాద్‌, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో భారత్‌ దేశం సమగ్ర అభివృద్ధి దిశగా సాగుతున్నదని. కాగజ్‌నగర్‌ కంజర్వేషన్‌ రిజర్వేషన్‌గా తీసుకు వచ్చి జీవో 49కి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఎంపీ గేడెం నగేష్‌ అన్నారు. 11ఏళ్ల బీజేపీ పాలనకు సంబంధించి గురువారం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే హరీష్‌బాబుతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థికాభివృద్ధిలో 11వ స్థానంలో ఉన్న భారతదేశంలో నాలుగో స్థానంకు వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో మూడో స్థానానికి చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పటిష్ట భారత్‌గా దేశం అవతరిస్తుందన్నారు. ఆసిఫాబాద్‌ జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 143 సెల్‌పోన్‌ టవర్ల ప్రతిపాదించారని చెప్పారు. ఇందులో 80 టవర్లు వేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పీవీటీజీల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు జోడేఘాట్‌లో పర్యాటకాభివృద్ధి కోసం మరింత ప్రయత్నం చేస్తామని తెలిపారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ జిల్లా కన్వీనర్‌ అరిగెల నాగేశ్వర్‌రావు, నాయకులు కోట్నాక విజయ్‌, సొల్లు లక్ష్మి, చక్రపాణి, మురళీధర్‌, విజయ్‌కుమార్‌, ప్రసాద్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 10:27 PM