క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:31 PM
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యంతోపాటు శారీరక దారు ఢ్యం చేకూరుతుందని జిల్లా యు వజన క్రీడల అధికారి సీతారాంనా యక్ అన్నారు.
- జిల్లా యువజన క్రీడల అధికారి సీతారాంనాయక్
కల్వకుర్తి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యంతోపాటు శారీరక దారు ఢ్యం చేకూరుతుందని జిల్లా యు వజన క్రీడల అధికారి సీతారాంనా యక్ అన్నారు. ఆదివారం కల్వకు ర్తి మండల పరిధిలోని మార్చాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూని యర్, సీనియర్ బాలుర జిల్లాస్థాయి కబడ్డీ సె లక్షన్లు నిర్వహించారు. సీతారాంనాయక్ హాజరై క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాల్లో 2శాతం రిజర్వేషన్ల సదుపా యం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. అనంతరం కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్య దర్శి యాదయ్యగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ క్రీడలు డిసెంబరు 5 నుంచి 8వ తేదీ వరకు మహబూబ్‌నగర్‌లో నిర్వహి స్తారని తెలిపారు. సీనియర్ కబడ్డీ క్రీడలు కరీంనగర్‌లో జరుగుతాయన్నారు. ఈ కార్యక్ర మంలో నాయకులు మల్లేష్, పంచాయతీ కార్య దర్శి రమేష్, మాజీ వార్డు సభ్యులు దున్న భా స్కర్, సీనియర్ క్రీడాకారుడు జంగయ్యగౌడ్, శ్రీ నివాసులు, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు మో హన్‌లాల్, డాక్య, రామన్‌గౌడ్ పాల్గొన్నారు.