Share News

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:44 PM

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం చేకూ రుతుందని అథ్లెటిక్‌ అసో సియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సోలపో గుల స్వాములు అన్నారు.

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
అథ్లెటిక్స్‌ క్రీడలను పరిశీలిస్తున్న డాక్టర్‌ స్వాములు, నాయకులు జానంపల్లి సంతోష్‌

- అథ్లెటిక్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సోలపోగుల స్వాములు

కల్వకుర్తి, జూన్‌ 22 (ఆంధ్రజో ్యతి) : క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం చేకూ రుతుందని అథ్లెటిక్‌ అసో సియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సోలపో గుల స్వాములు అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని జి ల్లా పరిషత్‌ బాలుర ఉ న్నత పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపి కలు ఆదివారం నిర్వహిం చారు. వచ్చే నెల 6న హనుమకొండలోని జవహర్‌లాల్‌నెహ్రు స్టేడి యంలో నిర్వహించే 11వ తెలంగాణ స్టేట్‌ లె వల్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొ నేందుకు నిర్వహించిన పోటీలను ఆ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సోలపోగుల స్వాము లు, నాయకులు జానుంపల్లి సంతోష్‌లు ప్రారం భించారు. జిల్లాలోని 150మందికి పైగా క్రీడాకా రులు పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం స్వాము లు మాట్లాడుతూ క్రీడలతో మంచి ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన పేర్కొ న్నారు. క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురా వాలని ఆయన కోరారు. కార్యక్రమంలో అథ్లెటిక్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి అంజయ్య, పీడీలు ప్రసాద్‌, బాలయ్య, పీఈటీలు రాజేం దర్‌, మల్లేష్‌, సుభాషిణి, క్రీడాకారులు తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 22 , 2025 | 11:44 PM