Share News

వచ్చే నెల 6లోగా పూర్తి చేయండి

ABN , Publish Date - May 29 , 2025 | 11:18 PM

ప్రాజెక్టుల భూసేకరణ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై కలెక్టర్‌ అసహనం వ్యక్తంచేశారు.

వచ్చే నెల 6లోగా పూర్తి చేయండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌, మే 29 (ఆంధ్రజ్యోతి) : ప్రాజెక్టుల భూసేకరణ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై కలెక్టర్‌ అసహనం వ్యక్తంచేశారు. పాలమూరు-రంగారెడ్డి, మార్కం డేయ, మహాత్మాగాంధీ, కల్వకుర్తి ఎత్తిపోతల ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు సంబంధించి మిగిలి పోయిన భూసేకరణ పనులు అత్యంత వేగవం తంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ సమా వేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ పి.అమరేంద ర్‌తో కలిసి నీటిపారుదల, రెవెన్యూ, సర్వే ల్యాండ్‌ అధికారులతో జిల్లాలో ప్రధాన ప్రాజెక్టు లకు సంబంధించిన భూసేకరణ అంశంపై స మీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనులపై ఎప్పటికప్పుడు ముఖ్య మంత్రి సమీక్షిస్తున్నారని, అధికారులు కూడా నిబద్ధతతో పని చేసి సాగునీటి ప్రాజెక్టుల నిర్మా ణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాల న్నారు. అత్యంత మొదటి ప్రాధాన్యతగా భూసే కరణ పనులు జూన్‌ 6నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్‌ డి ప్యూటీ కలెక్టర్‌ అరుణ, నీటిపారుదల శాఖ అ ధికారులు సత్యనారాయణరెడ్డి, పార్థసారథి, ము రళి, జిల్లా సర్వే ల్యాండ్‌ అధికారి నాగేందర్‌, ఆర్డీవోలు మాధవి, సురేష్‌, భూసేకరణ విభాగం కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ నారాయణ, తహ సీల్దార్లు, రెవెన్యూ నీటిపారుదల శాఖల అధికా రులు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

6 నుంచి బడిబాట

జూన్‌ 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వ హించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ సమా వేశ మందిరంలో డీఈవో రమేష్‌కుమార్‌, సెక్టో రియల్‌ అధికారులు, ఎంఈవోలు, సీడీపీవోలు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ సమ న్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మా ట్లాడుతూ బడిబయట పిల్లలను గుర్తించి బడి లో చేర్పించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాల ల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, పథకాల గురించి త ల్లిదండ్రులకు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఏకరూప దుస్తులు జూన్‌8వ తేదీలోగా జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు చేరవేయాలని డీఆర్‌డీఏ పీడీ చిన్న ఓబులేష్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - May 29 , 2025 | 11:18 PM