Malluravi on Rajagopal Reddy Issue: ఫిర్యాదు వస్తే కమిటీలో చర్చిస్తాం
ABN , Publish Date - Sep 15 , 2025 | 05:46 AM
మ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అంశంపైన ఫిర్యాదులు వస్తే.. టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీలో చర్చిస్తామని, అంతే కానీ ఎవరికో ఆసక్తి ఉందని చర్చించబోమని కమిటీ చైర్మన్...
రాజగోపాల్‌రెడ్డి అంశంపై మల్లు రవి
హైదరాబాద్, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అంశంపైన ఫిర్యాదులు వస్తే.. టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీలో చర్చిస్తామని, అంతే కానీ ఎవరికో ఆసక్తి ఉందని చర్చించబోమని కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి అన్నారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిపైన దళితులు ఫిర్యాదు చేశారని, దానిపైన సమీక్షించిన కమిటీ.. ఆ ఫిర్యాదుకు వివరణ ఇవ్వాలని నర్సారెడ్డికి సూచించిందని తెలిపారు. కాంగ్రెస్ అంతర్గత వివరాలను మీడియా ముందు మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. నర్సారెడ్డి, పార్టీ నేత పూజల హరికృష్ణలపైన వచ్చిన ఫిర్యాదులపైన చర్చించేందుకు ఆదివారం గాంధీభవన్‌లో క్రమశిక్షణ చర్యల కమిటీ భేటీ అయింది.
ఆయుర్వేద రంగం అభివృద్ధికి చర్యలు: మల్లు రవి
బోరబండ: రాష్ట్రంలో ఆయుర్వేద రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి,మంత్రి దామోదర రాజనర్సింహలతో చర్చిస్తానని చెప్పారు. యూసు్‌ఫగూడలోని నిమ్స్ మే ఆడిటోరియంలో మూడు రోజుల పాటు జరిగిన విశ్వ ఆయుర్వేద పరిషత్ జాతీయ సదస్సు ఆదివారం ముగిసింది. చివరి రోజు కార్యక్రమంలో మల్లు రవి మాట్లాడుతూ.. ఆయుర్వేదం మన జీవన విధానమని, సంస్కృతిలో భాగమని చెప్పారు.