Share News

డాక్టర్‌ లైసెన్స్‌ రద్దు చేయాలని ఫిర్యాదు

ABN , Publish Date - Dec 19 , 2025 | 10:28 PM

సరైన వైద్యం అందించ కుం డా నిండు ప్రాణం పోవడా నికి కారణమైన డాక్టర్‌ ఎం. శ్రీలత లైసెన్స్‌ను రద్దు చేయా లని, శ్రీలత నర్సింగ్‌ హోంను సీజ్‌ చేయాలని కోరు తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు కొయ్యల ఏమాజీ శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు, డీఎంహెచ్‌వో అని తకు ఫిర్యాదు చేశారు.

డాక్టర్‌ లైసెన్స్‌ రద్దు చేయాలని ఫిర్యాదు

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): సరైన వైద్యం అందించ కుం డా నిండు ప్రాణం పోవడా నికి కారణమైన డాక్టర్‌ ఎం. శ్రీలత లైసెన్స్‌ను రద్దు చేయా లని, శ్రీలత నర్సింగ్‌ హోంను సీజ్‌ చేయాలని కోరు తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు కొయ్యల ఏమాజీ శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు, డీఎంహెచ్‌వో అని తకు ఫిర్యాదు చేశారు. డాక్టర్‌ నిర్లక్ష్యం వల్లనే ప్రాణం పోయిం దని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాలలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఉన్న శ్రీలత నర్సింగ్‌ హోమ్‌ కు కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన కుమ్మరి పద్మ వసంతరావు దంపతులు డెలి వరీ కోసం ఆసుపత్రికి ఈనెల 15వ తేదీన వచ్చారని తెలిపా రు. మధ్యాహ్నం 1 గంట ఆసుపత్రిలో అడ్మిట్‌ చేశారని కానీ 3.46 గంట లకు చెకప్‌ చేసి ఆపరేషన్‌ చేస్తానని చెప్పి రాత్రి 9 గంటల వరకు కూడా పట్టించు కోలేదన్నారు. రాత్రి డాక్టర్‌ వచ్చి కడుపులో ఉన్న బిడ్డ పల్స్‌ అందడం లేదని, ప్రాణం హైరిస్క్‌లో ఉందని ఆపరేషన్‌ చేయకుండా ఆపేశారన్నారు. తర్వా త ఆపరేషన్‌ చేయడంతో కడుపులో బిడ్డ చని పోయిందని తెలిపారు. బిడ్డ మృతికి కారణ మైన డాక్టర్‌ శ్రీలత లైసెన్స్‌ రద్దు చేసి, బాధిత కుటుంబానికి రూ. 2 5లక్షల నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుర్గం ఎల్లయ్య, రాజేశ్వర్‌, బాధితులు వసంతరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 10:28 PM