Share News

ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి

ABN , Publish Date - Oct 31 , 2025 | 11:16 PM

ప్రజలకు భద్రత కల్పించడం తో పోలీసుల పాత్ర గొప్పదని డీసీపీ భాస్కర్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, ఎఫ్‌ఐఆర్‌ నమోదు రిజిష్టర్‌లను పరిశీలించారు.

ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి

డీసీపీ భాస్కర్‌

భీమారం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు భద్రత కల్పించడం తో పోలీసుల పాత్ర గొప్పదని డీసీపీ భాస్కర్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, ఎఫ్‌ఐఆర్‌ నమోదు రిజిష్టర్‌లను పరిశీలించారు. ఆయన మా ట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తిం చాలన్నారు. సంఘ విద్రోహశక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. గు ట్కా, గంజాయి, జూదం వంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాల న్నారు. యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా అవగాహన కల్పించాల న్నారు. ఆయన వెంట శ్రీరాంపూర్‌ సీఐ వేణుచందర్‌, ఎస్‌ఐ లక్ష్మీప్రసన్న, పోలీసులు ఉన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 11:16 PM