Share News

kumaram bheem asifabad- విద్యార్థులు, యువతకు పోటీలు

ABN , Publish Date - Oct 14 , 2025 | 10:18 PM

జిల్లాలోని విద్యార్థులకు, యువతకు, ఔత్సాహిక పొటో, వీడియోగ్రాఫర్లకు ఈ నెల 21 పోలీసు ప్లాగ్‌ డే( అమర వీరుల దినోత్సవం)ను పురస్కరించుకుని పోటీలు నిర్వహించనున్నామని జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ తెలిపారు. ఔత్సాహికులు ఎవరైనా పాల్గొనే విధంగా జిల్లా పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫొటోలు లేదా రోడ్డు ప్రమాదాలు, సైబర్‌ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్‌, మూడనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు, అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాలలో పోలీసుల సేవ, ఇతర పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు తగ్గకుండా షార్ట్‌ వీడియోలను రూపొందించాలని చెప్పారు.

kumaram bheem asifabad- విద్యార్థులు, యువతకు పోటీలు
మాట్లాడుతున్న ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌

ఆసిఫాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని విద్యార్థులకు, యువతకు, ఔత్సాహిక పొటో, వీడియోగ్రాఫర్లకు ఈ నెల 21 పోలీసు ప్లాగ్‌ డే( అమర వీరుల దినోత్సవం)ను పురస్కరించుకుని పోటీలు నిర్వహించనున్నామని జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ తెలిపారు. ఔత్సాహికులు ఎవరైనా పాల్గొనే విధంగా జిల్లా పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫొటోలు లేదా రోడ్డు ప్రమాదాలు, సైబర్‌ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్‌, మూడనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు, అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాలలో పోలీసుల సేవ, ఇతర పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు తగ్గకుండా షార్ట్‌ వీడియోలను రూపొందించాలని చెప్పారు. అదే విధంగా పోలీసులు చేసినటువంటి సేవల ఫొటోలను (10/8 సైబ్‌) అందించాలని సూచించారు. ఉత్తమంగా ఉన్న మొదటి మూడు ఫొటోలను, వీడియోలను జిల్లాలో బహుమతి ప్రదానం చేస్తూ రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా అర్హత లభిస్తుందని తెలియజేశారు. ఈ ఫొటోలను, వీడియోలను అక్టోబరు 23వ తారీకు లోగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఐటీ కోర్‌ విభాగంలో ( ఐటీ కోర్‌ కో ఆర్డినేటర్‌ 9712670527) ఫొటోలు, పెన్‌ డ్రైవ్‌లో వేసి షాప్ట్‌ ఫిలింను అందజేయాలన్నారు. కాగా పోలీసు ప్లాగ్‌ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌ జిల్లాలోని విద్యార్థులకు ఆన్‌లైన్‌ వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ తెలిపారు. ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దు భాషలో 6వ తరగతి నుంచి పీజీ వరకు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చని అన్నారు. విద్యార్థులు తమ వ్యాసాలను అక్టోబరు 28లోగా

సమర్పించాలని సూచించారు.

నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి

ఆసిఫాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలనిఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నెలవారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదన్నారు. పోలీసు అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పెట్రోలింగ్‌, బ్లూకోల్ట్స్‌ వాహనాలతో అధికారులు, సిబ్బంది నిరంతరం గస్తీ కాస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న పలు కేసుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సస్పెక్ట్‌ షీట్‌, రౌడీ షీట్‌లలో నమోదైన వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు, మట్కా జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ పంట భూముల్లో గంజాయి సాగు నిర్మూలన కోసం పోలీసు సెర్చ్‌ టీమ్స్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలో ముఖ్యమైన అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించి తమ తమ నివాస ప్రాంతాల్లో, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చేయాలన్నారు. ప్రాపర్టీ కేసుల్లో ప్రస్తుతం పోలీసు శాఖ వినియోగిస్తున్న సాంతికేతికతను ఉపయోగించి నేరస్తులను పట్టుకుని సొత్తును రికవరీ చేసి బాధితులకు త్వరిగతిన అందేలా చూడాలని తెలిపారు. సైబర్‌ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా సైబర్‌ నేరాల్లో నగదును కోల్పోయి బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు వారికి అండగా ఉండాలని సూచించారు. ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. దీపావళి పండగ నేపథ్యంలో బాణా సంచా దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పర్యవేక్షణ నిర్వహించి ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. పోలీసు షీ టీంలు తనిఖీలు నిర్వహించి రద్దీ ప్రాంతాల్లో పర్యవేక్షించాలని సూచించారు.

Updated Date - Oct 14 , 2025 | 10:18 PM