kumaram bheem asifabad- భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలి
ABN , Publish Date - Sep 22 , 2025 | 10:52 PM
జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా రాష్ట్రంలో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి నష్ట పరిహారం, అటవీ శాఖ అనుమతులపై చర్యలు పకడ్బందీగా చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, జాతీయ రహదారులు, అటవీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అటవీ శాఖాధికారులు, అదనపు కలెక్టర్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా రాష్ట్రంలో భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి నష్ట పరిహారం, అటవీ శాఖ అనుమతులపై చర్యలు పకడ్బందీగా చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, జాతీయ రహదారులు, అటవీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అటవీ శాఖాధికారులు, అదనపు కలెక్టర్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారి, రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేపడుతున్న జాతీయ రహదారులు, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారుల నిర్మాణంలో ముంపునకు గురవుతున్న భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించి వారికి మెరుగైన నష్ట పరిహారం అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అటవీ శాఖ అనుమతులు, కోర్టు కేసులను త్వరగా పరిష్కరించి సంబంధిత యజమానులకు నష్ట పరిహారం అందించాలని చెప్పారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్ భవన సముదాయంలో గల వీసీ హాల్ నుంచి కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అటవీ శాఖాధికారి నీరజ్‌కుమార్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వరరావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్మించిన జాతీయ రహదారి నిర్మాణంలో భూములు, ఇళ్లు ఇతర ఆస్తులు కోల్పోయిన వారికి నష్ట పరిహారం అందిస్తున్నామని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న కేసులపై న్యాయస్థానం తీర్పుతో సంబంఽ దిత యజమానులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా రహదారుల నిర్మాణాలకు అటవీ శాఖ అనుమతుల కోసం చర్యలు తీసుకుంటా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు.
రిజర్వేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి
ఆసిఫాబాద్, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రిజర్వేషన్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లకు రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టేందుకు విధివిధానాలపై మండల పరిషత్ అభివృద్ధి అదికారులు, మండల పంచాయతీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిం చేందుకు సన్నద్దమవుతున్న తరుణంలో వార్డు సభ్యుల స్థానాలు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పకడ్బంధీగా చేపట్టాలని తెలిపారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనకబడిన తరగతులు జనాభాను ప్రామాణికంగా తీసుకోవాలని, 2019 స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల రిజర్వేషన్‌ను, 2011 జనాభా, 2024 సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన వెనకబడిన తరగతుల గణన ప్రామాణికంలో తీసుకోవాలని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలలో సర్పంచ్, వార్డు సభ్యులకు నిబంధనలను పాటించాలని అన్నారు. రిజర్వేషన్ ప్రక్రియలు ఎలాంటి లోటు పాట్లు జరగకుండా పకడ్బంధీగా చేపట్టి నివేదికలు సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో లక్ష్మినారాయణ, డీపీవో భిక్షపతిగౌడ్, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.