Share News

బాధిత రైతులకు పరిహారం చెల్లించాలి

ABN , Publish Date - Oct 31 , 2025 | 11:12 PM

మెంథా తుఫాన్‌ ప్రభావంతో హా జీపూర్‌ మండలం పెద్దంపేట గ్రామంలో నేలకొరిగిన పంటలను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి శుక్రవారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా రైతులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు.

బాధిత రైతులకు పరిహారం చెల్లించాలి
పంటను పరిశీలిస్తున్న రఘునాథ్‌ వెర్రబెల్లి

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి

హాజీపూర్‌, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి) : మెంథా తుఫాన్‌ ప్రభావంతో హా జీపూర్‌ మండలం పెద్దంపేట గ్రామంలో నేలకొరిగిన పంటలను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి శుక్రవారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా రైతులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపో యారని రఘునాథ్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్వే నిర్వహించి, ఎకరానికి వచ్చే పంట దిగుబడి ఆధారంగా కనీస మద్దతు ధర మేరకు రైతులకు నష్టప రిహారం చెల్లించాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల పంట నష్టం జరిగినపుడు రైతులకు బీమా లభించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎనగందుల కృష్ణమూర్తి, మాధవరపు వెంకట రమణరావు, బేతు రవి, అశ్విన్‌ రెడ్డి, సతీష్‌, ప్రేమ్‌సాగర్‌, మారు వెంకట్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 11:12 PM