Share News

Kurnool Bus Tragedy: కర్నూలు బస్సు ప్రమాద.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేత

ABN , Publish Date - Oct 27 , 2025 | 01:48 AM

ఈ నెల 24న ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆరుగురు మృ...

Kurnool Bus Tragedy: కర్నూలు బస్సు ప్రమాద.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందజేత

గద్వాల న్యూటౌన్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 24న ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ కుమార్‌ ఆదేశాల మేరకు ఆదివారం గద్వాల ఆర్డీవో అలివేలు కర్నూలుప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబసభ్యులకు రూ. 5 లక్షల చొప్పున చెక్కుల్ని అందజేశారు. మృతులు చందనమంగ, సంధ్యారాణి(హైదరాబాద్‌), మేఘనాథ్‌(కోదాడ), అనూష(నల్గొండ), బొంత ఆదిశేషగిరిరావు(హైదరాబాద్‌), కెనుగ దీపక్‌(రాయగడ్‌) కుటుంబసభ్యులు ఈ ఎక్స్‌గ్రేషియా అందుకున్నారు.

Updated Date - Oct 27 , 2025 | 01:48 AM