Share News

Police Martyr Family: ఎట్టకేలకు ఫలించిన నిరీక్షణ

ABN , Publish Date - May 21 , 2025 | 05:28 AM

సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో కానిస్టేబుల్‌ భర్త మృతి చెందిన భార్య వేములపతి దేవికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం కల్పించబడింది. ఆరేళ్లుగా నిరాకరింపులు ఎదురైన తర్వాత ఈ నియామకం గైర్హాజరు ప్రాంతానికి సంబంధించి సమస్యను పరిష్కరించింది.

Police Martyr Family: ఎట్టకేలకు ఫలించిన నిరీక్షణ

  • సీఎం చొరవతో కానిస్టేబుల్‌ భార్యకు కారుణ్య నియామకం

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో కానిస్టేబుల్‌ భార్య వేములపతి దేవికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించింది. నగరంలోని మహంకాళి పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ బి.రవికుమార్‌ విధి నిర్వహణలో భాగంగా 2018లో మృతి చెందాడు. రవికుమార్‌ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందినవాడు కావడంతో ఆరేళ్లుగా ఏపీ, తెలంగాణ మధ్య కారుణ్య నియామక అంశం ఎటూ తేలకుండా పోయింది. దీంతో కొన్ని నెలల క్రితం దేవి ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు. ప్రజావాణి ఇంచార్జి చిన్నారెడ్డి, రాష్ట్ర నోడల్‌ అధికారిణి దివ్య దేవరాజన్‌ ఈ విషయాన్ని సీఎం రేవంత్‌ దృష్టికి తీసుకెళ్లారు. రవికుమార్‌ హైదరాబాద్‌ పోలీసు అయినందున... దేవికి ఇక్కడే ఉద్యోగం ఇవ్వాలంటూ సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో దేవిని నాంపల్లి రెవెన్యూ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా నియమిస్తూ హైదరాబాద్‌ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - May 21 , 2025 | 05:28 AM