kumaram bheem asifabad- నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:21 PM
నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఐ సత్యనారాయణ అన్నారు. మండలంలోని బంబార గ్రామంలో శుక్రవారం ఉదయం పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వాంకిడి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఐ సత్యనారాయణ అన్నారు. మండలంలోని బంబార గ్రామంలో శుక్రవారం ఉదయం పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 32 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కనపడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గంజాయి, గుడుంబా, రేషన్ బియ్యం, వంటి అక్రమ రవాణా దృష్టికి వస్తే వెంటనే 100కు డయల్ చేయాలని చెప్పారు. లేని పక్షంలో స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత చదువులపై దృష్టి పెట్టాలని తెలిపారు. కార్యక్రమంలో వాంకిడి, కెరమెరి ఎస్సైలు మహెందర్, మధుకర్, సిబ్బంది పాల్గొన్నారు.